Posts

Showing posts from August, 2018

అంకితం..

కపిల్ కుందు కి 22 ఏళ్ళు.. చిన్నప్పటి నుండి చాలా చురుకైనవాడు. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు మార్కులు ఒక్కసారైనా 90 కి తక్కువ వచ్చేవి కావు. ఎంత తెలివిగలవాడో అంత మృదుస్వభావి తను. అందుకే తనంటే స్నేహితులకే కాదు టీచర్లకూ అంత ప్రేమ. విధి నిర్వహణ నిమిత్తం, తల్లితండ్రులకు దూరంగా ఎక్కడో ఉంటున్నాడు. తను ఎక్కడున్నా మనసంతా తల్లితండ్రుల గురించిన ఆలోచనలే. కానీ విధి నిర్వహణ పట్ల తన విధేయత, ఆ ప్రేమను సైతం అధిగమిస్తోంది.  ఇక్కడ తల్లితండ్రులు ప్రాణం పెట్టుకుని తన కోసం చూస్తుంటారు. ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చివెళ్ళే కొడుకుని చూసుకుని మురిసిపోతారు. కానీ మురిసినంతసేపు పట్టదు.. తను విధి నిర్వహణ నిమిత్తం తిరుగు ప్రయాణమైపోతాడు. ఈసారి ఎప్పుడెప్పుడొస్తాడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది ఆ తల్లి.. ఇంకో వారం రోజుల్లో అతనికి 23 ఏళ్ళు నిండుతాయి  కొడుకు పుట్టినరోజు నాడున తను దగ్గరలేనందున ఈసారి వచ్చినప్పుడైనా పండుగలా జరపాలనుకున్నారు ఆ తల్లితండ్రులు. ఎంతో ఆశగా ఎదురుచూస్తే ఈసారి ఆ కొడుకు మృతశరీరమై వచ్చాడు. విధినిర్వహణలో ప్రాణాలర్పించాడతను.               ...