Posts

Showing posts from 2020

ఎవరు గురువులు?

ఆషాడ శుద్ధ పౌర్ణమి ని ఆషాడ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం. వేదవ్యాస మహర్షి అవతరించిన రోజునే వ్యాస పూర్ణిమ అంటాం. వేదాలను విభజించి, వేదాలతోబాటు, మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలనూ రచించి, జగతికిచ్చిన వారు వేదవ్యాస మహర్షి.  లోకానికంతటికీ జ్ఞానాన్ని పంచిన వ్యాసభగవానుడు ఈ లోకానికే గురువు. కాబట్టి వ్యాస పూర్ణిమనే గురుపూర్ణిమగా జరుపుకుంటాం. గురువులను స్మరించుకుని, నమస్కరించుకుని తరిస్తాం. మరి.. గురువు అంటే ఎవరు?? గుకార: అంధకారస్యాత్‌ రుకార: తన్నిరోధక: అంధకార నిరోధత్వాత్‌ గురురిత్యభిధీయతే ‘గు’ అనగా అంధకారము, ‘రు’ అనగా చీకటిని తొలగించే వెలుగు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి, జ్ఞానజ్యోతిని వెలిగించే వారే "గురువు" గురువు ప్రాముఖ్యతను గురించి సంత్ కబీర్ : गुरु गोविंद दोनों खड़े, काके लागूं पाँय ।  बलिहारी गुरु आपनो, गोविंद दियो मिलाय ॥ - అని చెప్పిన దోహె ఇది. దాని అర్ధం: "గురువూ, భగవంతుడూ ఇద్దరూ ఒకేసారి నాముందుకి వస్తే.., ఆ భగవంతుడిని నాకు చూపిన (తెలిపిన) గురువుకే నేను ముందుగా నమస్కరిస్తాను / ప్రణమిల్లుతాను." ఈ మాట చాలు, "గురుస్థానం" అన్...

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

ఎనిమిదేళ్ళకే గణ, యతి ప్రాసలంటే తెలియకుండానే తన మొదటి గీతం రాసి, పదో ఏటే తన మొదటి నవల రాసి, పదిహేనేళ్ళకే ఒక నవల అచ్చు వేయించి, పద్దెనిమిదేళ్ళకే ఖండకావ్య సంపుటి రాసి, తండ్రిగారు ఇచ్చిన డబ్బుతో దాన్ని అచ్చు వేయించి అలా అడుగేసిన శ్రీశ్రీ.. ఈ శతాబ్దం నాదంటూ నినదించి, నడిపించిన శ్రీశ్రీ.. "సినిమాకవికి సినిమా నిర్మాణంలో తనదిగా చెప్పుకోవడానికి ఏమీలేదు కనుక.. నేను తెలుగు సినిమాకవినని చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పుకుంటాను.., కాకపోతే నా ఆశయాలనీ, భావాలనీ లక్షలాది ప్రజలకి తెలియజేయటానికి "సినిమా"ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాను" అని చెప్పాడు. ఒక్కసారి శ్రీశ్రీ సినీరచనలను గమనిస్తే ఎన్నో పార్శ్వాలు. " నా హృదయంలో నిదురించే చెలీ.. (ఏ.ఎన్.ఆర్. ఆరాధన)" అంటూ ప్రేమ పాట రాసి, ఆ చెలి ఎవరని అడిగితే.. "కమ్యూనిస్ట్ పార్టీ" అని సమాధానమిచ్చిన చతురుడు.  " కూటికోసం కూలి కోసం.. (ఆకలిరాజ్యం)" అంటూ ఆకలి కేకలు వినిపించి, క ష్టజీ వి కి ఇరువైపులా నిలిచిన వాడే కవి అని నిరూపించినవాడు. ఎవరిమీదా ఆధారపడకుండా, మనిషి ముందు తనని తాను నమ్ముకోవాలని చెబుతూ.. " ఎవరో ...