Posts

Showing posts from 2024
October 02, 2024  గాంధీ జయంతి  సందర్భంగా గాంధేయవాదానికి    'అ',   'ఆ'    లు ~~~~~~~~~~~~ * ~~~ * ~~~ * ~~   గాంధీగిరీ కి ఆసరా.. గాంధీయిజానికి అవసరం.. వారిరువురు. నేను గాంధేయవాదిని కాను. బళ్ళో చెప్పిన విషయాల వలన స్వాతంత్ర్యోద్యమాన్ని ఆది నుండీ నడిపిన వ్యక్తి గానూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఒకే ఒక్క వ్యక్తి గానూ మహాత్మా గాంధీని గూర్చి అభిప్రాయపడ్డాను. కాలక్రమేణా ఎందరో స్వాతంత్ర్య విప్లవవీరుల పోరాటాలను గురించీ, వారి త్యాగాలను గురించీ తెలుసుకున్నాక.. ఆలోచన మొదలైంది. అసలు మహాత్మాగాంధీ భారత దేశానికి రాకమునుపే ఊపిరిలూదుకున్న  స్వాతంత్ర్యోద్య మ వివరాలు జ్ఞప్తి చేసుకున్నాక, నెమ్మదిగా నా ఆలోచనలు, అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. ఎంతోమంది భారత  స్వాతంత్ర్య  వీరులు, బ్రిటీషర్లకి వ్యతిరేకంగా తమ విప్లవ పోరాట స్ఫూర్తి రగిలించి, ఎదిరించి, నిలిస్తే మహాత్మాగాంధీ కేవలం అహింసాయుధంతో పోరాడడం నాకు మనస్కరించలేదు. (సరే అందుకు నా అర్హత ఏపాటి? ఇది కేవలం నా అభిప్రాయం అంతే)  అలాగని మహాత్మాగాంధీ అంటే విముఖతో వ్యతిరేకతతో లేదు గానీ, గాంధేయమార్గం కన్నా...
Image
                                                                  "ప్రేరణ"                                                          ( ప్రేరణ హెల్పింగ్ సొసైటీ ) గమనిక:  అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యంగా (మూడు రోజుల అనంతరం) రాస్తున్న పోస్టు.  నేను ఎంబీఏ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు.. ఓసారి నా స్టూడెంట్స్ కొందరు ఏదో బయటి ఈవెంట్ సందర్భంగా హడావిడిగా ఉండడం చూసి ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పగా తెలిసింది. "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ" వార్షికోత్సవ కార్యక్రమం జరపబోతున్నట్లూ, ఆ సొసైటీలో తాము కూడా సభ్యులనీ, సొసైటీ తరపున చేసే ప్రతి సేవా కార్యక్రమాలలో తామూ పాల్గొంటారనీ.  అలా "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ" గురించి మొదటిసారి విన్నాను. "ప్రేరణ" ఆ పేరే మొదట ఆకట్టుకుంది. సొసైటీ ...