ఓ బేబి! ఇది రివ్యూ కాదు కేవలం నా వ్యూ. సాధారణంగా ఎవరైనా మనల్ని "దేవుడు ఎదురై వరమిస్తే నువ్వేం కోరుకుంటావు?" అని ప్రశ్నిస్తే.. ఆ.. ఇది జరిగేదా ఫాడా.. అన్న ఉద్దేశ్యంతో ఏదో చిలిపి కోరికలను వెలిబుచ్చుతుంటాం. అప్పుడప్పుడూ సరదాగా ఇలాంటి చిలిపి ఆలోచనలూ ఊహలూ కలుగుతుంటాయి. అలాగే "వయసైపోయాక చేజారిపోయిన యవ్వనం తిరిగి వస్తే..??" అని ఓ కొరియన్ దర్శకుడికి కలిగిన చిలిపి ఆలోచనకు దృశ్య రూపమే కొరియన్ చిత్రం - " మిస్ గ్రానీ ". ఆ చిత్రానికి రీమేకే నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన "ఓ బేబీ". లక్ష్మి (బామ్మగా) - సమంత(పడుచు పిల్లగా మారిన బామ్మగా), ప్రధాన పాత్రలో నటించగా రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య, బాల నటుడిగా గుర్తింపు పొందిన తేజ, ఇతర తారాగణం. " అమ్మలురా.. మనకి తిండి పెట్టేదీ వాళ్ళే మన చేత తిట్లు తినేదీ వాళ్ళే ", " అన్నది మనవాళ్ళే కదా! మన మంచి కోసమే కదా! మనకి ఇంక ఇగో ఎందుకు? " " ఇంట్లో అమ్మమ్మో, తాతయ్యో, నాన్నమ్మో లేకపోతే ఎవరడుగుతార్రా మనల్ని తిన్నావా.. ఉన్నావా అని? " " వాళ్ళున్నంత వరకేరా మనం చిన్న పిల్లలం,...
Posts
Showing posts from July, 2019