Posts

Showing posts from February, 2019
                                    నివాళి                         ★~~💐🇮🇳💐~~~★ మొన్న ఫిబ్రవరి పధ్నాలుగున ,  పుల్వామాలో మన సీ.ఆర్.పీ.ఎఫ్. జవాన్ల పైన జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో సంఘీభావం తెలుపుతూ అటు వాట్సాప్ లోనూ ఇటు ఫేస్-బుక్ లోనూ మెసేజ్ లు ప్రవాహంలా వస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ అందుకు ప్రతీకారంగా మనం విహార యాత్రకి వెళ్ళదలచుకుంటే కాష్మీరుకి వెళ్ళడం మానుకోవాలనీ, అలాగే  కాష్మీరీలు అమ్మే ఎటువంటి వస్తువులను కొనకూడదనీ, తద్వారా కాష్మీరులోని ఉగ్రవాదులకు నిధులను స్థంబింపచేయచ్చుననీ ఒకరు పంపితే, దెబ్బకు దెబ్బ తియ్యవలసినదే వారినీ ఊచకోత కొయ్యాలంటూ ఒకరూ, అసలు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలి అంటూ మరొకరూ,  వీర దేశభక్తితో మెసేజ్ లు పంపుతున్నారు. తప్పనికాదు. కానీ వీటిలో నన్ను ఆలోచింప చేసిన ఒక ముఖ్య సందేశం కాష్మీరీలకు సహాయ నిరాకరణ. నాదొక సందేహం. కాష్మీరు మన భారత భూభాగంలోనిదే కదా. మన కాష్మీరుని దౌర్జన్యంగా ఆక్రమించాలని చూస్...