"వినాయక చవితి" వస్తోంది అంటేనే భక్తి కన్నా ఎక్కువగా పోటీ కనపడుతుంటుంది. విఘ్నాలను తొలగిస్తాడని వినాయకుడికి దండం పెట్టుకుని వీధిలోకి వెళ్తే ప్రతీ వీధిలోనూ అడ్డంగా కూర్చుని ఆయనే విఘ్నమై ఎదురవడమూ.. మరొక పక్క అలా ప్రతిష్ఠించిన విగ్రహాలు పర్యావరణాన్నే కాక పండుగ జరిపే పద్ధతిని కూడా కలుషితం చేస్తున్నాయన్న బాధ.., నాలో ఓ ఆలోచన కలిగించింది. అదే.. ఈ "వినాయకుని విన్నపం" 2014వ సంవత్సరంలో సరదాగా రాస్తే, చదివిన సన్నిహితులు చాలా బాగుంది, ఉపయోగపడే సందేశం కాబట్టి నలుగురికీ తెలిస్తే ఫలితం ఉండచ్చు కదా అంటే 2015వ సంవత్సరంలో ఇది బ్లాగులో పోస్ట్ చేశాను. ఇదివరకొకసారి అది షేర్ చేశాను. కానీ రాయడానికి వెనకున్న గల ప్రేరణ పంచుకుందామని పించి ఇప్పుడిలా పంచుకున్నాను. ఇక చదవండి.. "వినాయకుని విన్నపం" ఇంకో రెండు రోజుల్లో వినాయకచవితి ఉంది అనగా.. హఠాత్తుగా వినాయకుడు కనపడకుండాపోయాడు. కైలాసంలో హడావుడి మొదలైంది. ఇంతలో ఎలా తెలిసిపోయిందో మన దేవలోకంలోని మీడియా వారికి..వార్తలు ప్రసారం చేయటం మొదలుపెట్టేశారు కూడా. " కైలాసంలో కలకలం..విఘ్ననాయకుని పండుగకే విఘ్నం. కనపడకుండా పో...
Posts
Showing posts from 2015
నా కోసం ప్రయత్నించే ..నీకోసం నిరీక్షిస్తూ...
- Get link
- X
- Other Apps
ప్రియమైన నీకు... నేనే. అవును స్వయానా నేనే...నీకు రాస్తున్న లేఖ. ప్రపంచమంతా ప్రేమ నిండి ఉంది. నేడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ వారి ప్రేమని వ్యక్తపరుస్తుంటే..నాకు కూడా ఈరోజు నా మనసులోని మాట నీకు చెప్పాలనిపించింది. నువ్వు నన్ను ప్రేమించావు. నాకు తెలుసు. నాకోసం నువ్వు కొన్నాళ్ళు నిరీక్షించావు కూడా. కానీ నా నుండి స్పందన లేదన్న ఒక అపోహతో నేను నిన్ను అంగీకరిస్తానో లేదోనన్న అనుమానంతో నువ్వు " తనని " కలిసావు.. " తనతో "నే ఉండిపోయావు. నేను కాదంటానేమో అన్న ఒక అపోహతో నువ్వే తన వెనక పడ్డావు. "తనని" వరించావు. కానీ... ...నువ్వు నన్నెంతగా ప్రేమించావో నేను కూడా నిన్ను అంతగా ప్రేమించానని నీకు తెలుసా? అనుక్షణం నేను నిన్నంటిపెట్టుకునే వచ్చాను..ప్రతీ క్షణం నీ నీడలా నీ వెనకే వచ్చాను కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. ఇది కాకపోతే అది..అది కాకపోతే మరొకటి అనుకునే వరస నీది . దానికి తోడు నీ " స్నేహితుల " సహచర్యం నీ నమ్మకాన్ని బలహీనపరిచింది , నా పైన నీ ప్రేమను తుంచి వేసింది. వారిని కాకుండా నీ అంతరాత్మను నమ్ముకుని నువ్వు ప్రయత...
"సేవ - అరుణోదయ సేవాశ్రం"
- Get link
- X
- Other Apps
" సేవ - అరుణోదయ సేవాశ్రం " సంప్రదించవలసిన నంబరు: 9848539767 ( ఫోన్ నంబరులో చిన్న సవరణ: త్వరలో పై ఫోటో లోని - పైన పేర్కొనబడిన బోర్డులోని నంబరు తీసివేసి, ఈ కొత్త నంబరు చేర్చబడుతుంది. ) వయసుమీరిన వారికి పెద్దగా కోరికలుండవు. వారు కోరుకునేది ఒక తోడు అంతే. కానీ అదే లేకపోతే? ఆదరణ మాట దేవుడెరుగు, కనీసం నిలువ నీడైనా లేకపోతే? అందుకే అలాంటివారికోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించాలన్న సంకల్పంతో తన స్వంత స్థలంలోనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసింది ఆమె. ఆమె శ్రీమతి మంజూష . అదే " సేవ - అరుణోదయ సేవాశ్రం " రంగంపేటలోని "శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల" కు కాస్త ముందుగా అదే రోడ్డులో (నాగయ్యగారిపల్లె, చంద్రగిరి మండలం లో) ఉంది ఆ ఆశ్రమం. ఒక సగటు సాదారణ మహిళ ఆలోచనకు అందమైన రూపం అది. మనం మన జీవితంలో ఎన్నోకష్టాలు పడ్డామనుకుంటుంటాం. అయినా బతుకుతున్నాం అనుకుంటుంటాం. అవును "బతికేస్తున్నాం" కానీ ఆదరించే వారు లేక అయినవారుండీ ఆదరణకి నోచుకోలేకపోతూ కూడా వారు "జీవిస్తున్నారు". అవును మనం బతుకుతున్నాం వారు జీవిస్తున్నారు . అక్కడ...
- Get link
- X
- Other Apps
పేరు లేని లేఖ ! "నిన్ను ప్రశ్నించే వీలు లేక, నా భావాలను ఆపలేక, తలంపులను దారి మళ్ళించలేక రాసుకున్నాను ఈ ఊరు పేరు లేని లేఖ!" ఏం చేశావు నువ్వు? ఏం సాధించావు నువ్వు? ఎందుకా నవ్వు? ఏదో సాధించి పెట్టావని అనుకుంటారంతా కానీ నీకు తెలుసుగా నీ అంతరాత్మకు తెలుసుగా అసలు నిజం. ఇందులో నీ స్వార్ధం లేదూ? ఆత్మ కధ రాసుకున్నావే..ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోలేదా నువ్వు? నీ వలన కాదూ వారు చనిపోయింది? నీ "చేతకాని మంచితనం" వలన కాదూ వారు మనకి కాకుండాపోయింది? మనలో లేకుండాపోయింది? వారిని, వారి జీవితాన్ని ఆర్పేసి..నువ్వు మాత్రం వెలుగుతూనే ఉన్నావే.. ఆనాడు నీకు దెబ్బ తగలకుండా ఉండుంటే..నీకు పరాభవం జరగకపోయుంటే...నీకు నొప్పి కలగకపోయుంటే..ను...
- Get link
- X
- Other Apps
ఆహా!........ఆ.హ్? డిసెంబరు 31 అర్ధరాత్రి. చాలా కోలాహలంగా ఉంది ఊరంతా.. కొత్త సంవత్సరం రాబోతోందని విందులు వినోదాలతో..కొత్త ఉత్సాహంతో తిరుగుతున్నారు అంతా.. ఏ చోట చూసినా అంతా జనసమూహంతో..యువజనోత్సాహంతో వారి కేరింతల తో నిండిపోయింది.. వీధులన్నీ ఈ ఉత్సాహాన్ని కళ్ళల్లో వెలుగులు నింపుకుని మరీ చూస్తున్నాయి .. ఎక్కడా చీకటన్న మాటే లేదు. (ఈ చలిలో రోడ్డు పక్కగా ముడుచుకుని పడుకుని ఉన్న భిక్షగాళ్ళ మనసుల్లో తప్ప. వారి జీవితాల్లో తప్ప . నిజమే మరి ఎన్ని సంవత్సరాలు వచ్చిన వారి జీవితాలలో ఐతే మార్పు ఉండదుగా. అయినా ఇవన్నీ అలోచించే పరిస్తిత్లో ఎవరూ లేరు. ఎవరి ఆనందంలో వారున్నారు ). సరదాగా అర్ధరాత్రి పూట స్నేహితులతో బైకు మీద చక్కర్లు కొడితే ఆ మజానే వేరు. అందులోను ఇలా బైకు వెలుతురుతో రాత్రి చీకట్లను చీలుస్తూ..కొత్త సంవత్సరాన్ని అందరికోసం, మనమే మన వీపు మీద మూటకట్టుకుని మోసుకొచేస్తున్న అనుభూతి మరీ ఆనందంగా ఉంటుంది కదా. కుర్రకారు హుషారుగా బైకులలో రేసులు పెట్ట...