October 02, 2024 గాంధీ జయంతి సందర్భంగా గాంధేయవాదానికి 'అ', 'ఆ' లు ~~~~~~~~~~~~ * ~~~ * ~~~ * ~~ గాంధీగిరీ కి ఆసరా.. గాంధీయిజానికి అవసరం.. వారిరువురు. నేను గాంధేయవాదిని కాను. బళ్ళో చెప్పిన విషయాల వలన స్వాతంత్ర్యోద్యమాన్ని ఆది నుండీ నడిపిన వ్యక్తి గానూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఒకే ఒక్క వ్యక్తి గానూ మహాత్మా గాంధీని గూర్చి అభిప్రాయపడ్డాను. కాలక్రమేణా ఎందరో స్వాతంత్ర్య విప్లవవీరుల పోరాటాలను గురించీ, వారి త్యాగాలను గురించీ తెలుసుకున్నాక.. ఆలోచన మొదలైంది. అసలు మహాత్మాగాంధీ భారత దేశానికి రాకమునుపే ఊపిరిలూదుకున్న స్వాతంత్ర్యోద్య మ వివరాలు జ్ఞప్తి చేసుకున్నాక, నెమ్మదిగా నా ఆలోచనలు, అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. ఎంతోమంది భారత స్వాతంత్ర్య వీరులు, బ్రిటీషర్లకి వ్యతిరేకంగా తమ విప్లవ పోరాట స్ఫూర్తి రగిలించి, ఎదిరించి, నిలిస్తే మహాత్మాగాంధీ కేవలం అహింసాయుధంతో పోరాడడం నాకు మనస్కరించలేదు. (సరే అందుకు నా అర్హత ఏపాటి? ఇది కేవలం నా అభిప్రాయం అంతే) అలాగని మహాత్మాగాంధీ అంటే విముఖతో వ్యతిరేకతతో లేదు గానీ, గాంధేయమార్గం కన్నా...
Posts
- Get link
- X
- Other Apps
"ప్రేరణ" ( ప్రేరణ హెల్పింగ్ సొసైటీ ) గమనిక: అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యంగా (మూడు రోజుల అనంతరం) రాస్తున్న పోస్టు. నేను ఎంబీఏ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు.. ఓసారి నా స్టూడెంట్స్ కొందరు ఏదో బయటి ఈవెంట్ సందర్భంగా హడావిడిగా ఉండడం చూసి ఏమిటని అడిగితే వాళ్ళు చెప్పగా తెలిసింది. "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ" వార్షికోత్సవ కార్యక్రమం జరపబోతున్నట్లూ, ఆ సొసైటీలో తాము కూడా సభ్యులనీ, సొసైటీ తరపున చేసే ప్రతి సేవా కార్యక్రమాలలో తామూ పాల్గొంటారనీ. అలా "ప్రేరణ హెల్పింగ్ సొసైటీ" గురించి మొదటిసారి విన్నాను. "ప్రేరణ" ఆ పేరే మొదట ఆకట్టుకుంది. సొసైటీ ...
ఎవరు గురువులు?
- Get link
- X
- Other Apps
ఆషాడ శుద్ధ పౌర్ణమి ని ఆషాడ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం. వేదవ్యాస మహర్షి అవతరించిన రోజునే వ్యాస పూర్ణిమ అంటాం. వేదాలను విభజించి, వేదాలతోబాటు, మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలనూ రచించి, జగతికిచ్చిన వారు వేదవ్యాస మహర్షి. లోకానికంతటికీ జ్ఞానాన్ని పంచిన వ్యాసభగవానుడు ఈ లోకానికే గురువు. కాబట్టి వ్యాస పూర్ణిమనే గురుపూర్ణిమగా జరుపుకుంటాం. గురువులను స్మరించుకుని, నమస్కరించుకుని తరిస్తాం. మరి.. గురువు అంటే ఎవరు?? గుకార: అంధకారస్యాత్ రుకార: తన్నిరోధక: అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే ‘గు’ అనగా అంధకారము, ‘రు’ అనగా చీకటిని తొలగించే వెలుగు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి, జ్ఞానజ్యోతిని వెలిగించే వారే "గురువు" గురువు ప్రాముఖ్యతను గురించి సంత్ కబీర్ : गुरु गोविंद दोनों खड़े, काके लागूं पाँय । बलिहारी गुरु आपनो, गोविंद दियो मिलाय ॥ - అని చెప్పిన దోహె ఇది. దాని అర్ధం: "గురువూ, భగవంతుడూ ఇద్దరూ ఒకేసారి నాముందుకి వస్తే.., ఆ భగవంతుడిని నాకు చూపిన (తెలిపిన) గురువుకే నేను ముందుగా నమస్కరిస్తాను / ప్రణమిల్లుతాను." ఈ మాట చాలు, "గురుస్థానం" అన్...
మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)
- Get link
- X
- Other Apps
ఎనిమిదేళ్ళకే గణ, యతి ప్రాసలంటే తెలియకుండానే తన మొదటి గీతం రాసి, పదో ఏటే తన మొదటి నవల రాసి, పదిహేనేళ్ళకే ఒక నవల అచ్చు వేయించి, పద్దెనిమిదేళ్ళకే ఖండకావ్య సంపుటి రాసి, తండ్రిగారు ఇచ్చిన డబ్బుతో దాన్ని అచ్చు వేయించి అలా అడుగేసిన శ్రీశ్రీ.. ఈ శతాబ్దం నాదంటూ నినదించి, నడిపించిన శ్రీశ్రీ.. "సినిమాకవికి సినిమా నిర్మాణంలో తనదిగా చెప్పుకోవడానికి ఏమీలేదు కనుక.. నేను తెలుగు సినిమాకవినని చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పుకుంటాను.., కాకపోతే నా ఆశయాలనీ, భావాలనీ లక్షలాది ప్రజలకి తెలియజేయటానికి "సినిమా"ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నాను" అని చెప్పాడు. ఒక్కసారి శ్రీశ్రీ సినీరచనలను గమనిస్తే ఎన్నో పార్శ్వాలు. " నా హృదయంలో నిదురించే చెలీ.. (ఏ.ఎన్.ఆర్. ఆరాధన)" అంటూ ప్రేమ పాట రాసి, ఆ చెలి ఎవరని అడిగితే.. "కమ్యూనిస్ట్ పార్టీ" అని సమాధానమిచ్చిన చతురుడు. " కూటికోసం కూలి కోసం.. (ఆకలిరాజ్యం)" అంటూ ఆకలి కేకలు వినిపించి, క ష్టజీ వి కి ఇరువైపులా నిలిచిన వాడే కవి అని నిరూపించినవాడు. ఎవరిమీదా ఆధారపడకుండా, మనిషి ముందు తనని తాను నమ్ముకోవాలని చెబుతూ.. " ఎవరో ...
- Get link
- X
- Other Apps
ఓ బేబి! ఇది రివ్యూ కాదు కేవలం నా వ్యూ. సాధారణంగా ఎవరైనా మనల్ని "దేవుడు ఎదురై వరమిస్తే నువ్వేం కోరుకుంటావు?" అని ప్రశ్నిస్తే.. ఆ.. ఇది జరిగేదా ఫాడా.. అన్న ఉద్దేశ్యంతో ఏదో చిలిపి కోరికలను వెలిబుచ్చుతుంటాం. అప్పుడప్పుడూ సరదాగా ఇలాంటి చిలిపి ఆలోచనలూ ఊహలూ కలుగుతుంటాయి. అలాగే "వయసైపోయాక చేజారిపోయిన యవ్వనం తిరిగి వస్తే..??" అని ఓ కొరియన్ దర్శకుడికి కలిగిన చిలిపి ఆలోచనకు దృశ్య రూపమే కొరియన్ చిత్రం - " మిస్ గ్రానీ ". ఆ చిత్రానికి రీమేకే నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన "ఓ బేబీ". లక్ష్మి (బామ్మగా) - సమంత(పడుచు పిల్లగా మారిన బామ్మగా), ప్రధాన పాత్రలో నటించగా రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య, బాల నటుడిగా గుర్తింపు పొందిన తేజ, ఇతర తారాగణం. " అమ్మలురా.. మనకి తిండి పెట్టేదీ వాళ్ళే మన చేత తిట్లు తినేదీ వాళ్ళే ", " అన్నది మనవాళ్ళే కదా! మన మంచి కోసమే కదా! మనకి ఇంక ఇగో ఎందుకు? " " ఇంట్లో అమ్మమ్మో, తాతయ్యో, నాన్నమ్మో లేకపోతే ఎవరడుగుతార్రా మనల్ని తిన్నావా.. ఉన్నావా అని? " " వాళ్ళున్నంత వరకేరా మనం చిన్న పిల్లలం,...
- Get link
- X
- Other Apps
నివాళి ★~~💐🇮🇳💐~~~★ మొన్న ఫిబ్రవరి పధ్నాలుగున , పుల్వామాలో మన సీ.ఆర్.పీ.ఎఫ్. జవాన్ల పైన జరిగిన ఉగ్రదాడి నేపధ్యంలో సంఘీభావం తెలుపుతూ అటు వాట్సాప్ లోనూ ఇటు ఫేస్-బుక్ లోనూ మెసేజ్ లు ప్రవాహంలా వస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ అందుకు ప్రతీకారంగా మనం విహార యాత్రకి వెళ్ళదలచుకుంటే కాష్మీరుకి వెళ్ళడం మానుకోవాలనీ, అలాగే కాష్మీరీలు అమ్మే ఎటువంటి వస్తువులను కొనకూడదనీ, తద్వారా కాష్మీరులోని ఉగ్రవాదులకు నిధులను స్థంబింపచేయచ్చుననీ ఒకరు పంపితే, దెబ్బకు దెబ్బ తియ్యవలసినదే వారినీ ఊచకోత కొయ్యాలంటూ ఒకరూ, అసలు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలి అంటూ మరొకరూ, వీర దేశభక్తితో మెసేజ్ లు పంపుతున్నారు. తప్పనికాదు. కానీ వీటిలో నన్ను ఆలోచింప చేసిన ఒక ముఖ్య సందేశం కాష్మీరీలకు సహాయ నిరాకరణ. నాదొక సందేహం. కాష్మీరు మన భారత భూభాగంలోనిదే కదా. మన కాష్మీరుని దౌర్జన్యంగా ఆక్రమించాలని చూస్...
అంకితం..
- Get link
- X
- Other Apps
కపిల్ కుందు కి 22 ఏళ్ళు.. చిన్నప్పటి నుండి చాలా చురుకైనవాడు. చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు మార్కులు ఒక్కసారైనా 90 కి తక్కువ వచ్చేవి కావు. ఎంత తెలివిగలవాడో అంత మృదుస్వభావి తను. అందుకే తనంటే స్నేహితులకే కాదు టీచర్లకూ అంత ప్రేమ. విధి నిర్వహణ నిమిత్తం, తల్లితండ్రులకు దూరంగా ఎక్కడో ఉంటున్నాడు. తను ఎక్కడున్నా మనసంతా తల్లితండ్రుల గురించిన ఆలోచనలే. కానీ విధి నిర్వహణ పట్ల తన విధేయత, ఆ ప్రేమను సైతం అధిగమిస్తోంది. ఇక్కడ తల్లితండ్రులు ప్రాణం పెట్టుకుని తన కోసం చూస్తుంటారు. ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చివెళ్ళే కొడుకుని చూసుకుని మురిసిపోతారు. కానీ మురిసినంతసేపు పట్టదు.. తను విధి నిర్వహణ నిమిత్తం తిరుగు ప్రయాణమైపోతాడు. ఈసారి ఎప్పుడెప్పుడొస్తాడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తోంది ఆ తల్లి.. ఇంకో వారం రోజుల్లో అతనికి 23 ఏళ్ళు నిండుతాయి కొడుకు పుట్టినరోజు నాడున తను దగ్గరలేనందున ఈసారి వచ్చినప్పుడైనా పండుగలా జరపాలనుకున్నారు ఆ తల్లితండ్రులు. ఎంతో ఆశగా ఎదురుచూస్తే ఈసారి ఆ కొడుకు మృతశరీరమై వచ్చాడు. విధినిర్వహణలో ప్రాణాలర్పించాడతను. ...