ఎవరు గురువులు?
ఆషాడ శుద్ధ పౌర్ణమి ని ఆషాడ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం. వేదవ్యాస మహర్షి అవతరించిన రోజునే వ్యాస పూర్ణిమ అంటాం. వేదాలను విభజించి, వేదాలతోబాటు, మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలనూ రచించి, జగతికిచ్చిన వారు వేదవ్యాస మహర్షి. లోకానికంతటికీ జ్ఞానాన్ని పంచిన వ్యాసభగవానుడు ఈ లోకానికే గురువు. కాబట్టి వ్యాస పూర్ణిమనే గురుపూర్ణిమగా జరుపుకుంటాం. గురువులను స్మరించుకుని, నమస్కరించుకుని తరిస్తాం. మరి.. గురువు అంటే ఎవరు?? గుకార: అంధకారస్యాత్ రుకార: తన్నిరోధక: అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే ‘గు’ అనగా అంధకారము, ‘రు’ అనగా చీకటిని తొలగించే వెలుగు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి, జ్ఞానజ్యోతిని వెలిగించే వారే "గురువు" గురువు ప్రాముఖ్యతను గురించి సంత్ కబీర్ : गुरु गोविंद दोनों खड़े, काके लागूं पाँय । बलिहारी गुरु आपनो, गोविंद दियो मिलाय ॥ - అని చెప్పిన దోహె ఇది. దాని అర్ధం: "గురువూ, భగవంతుడూ ఇద్దరూ ఒకేసారి నాముందుకి వస్తే.., ఆ భగవంతుడిని నాకు చూపిన (తెలిపిన) గురువుకే నేను ముందుగా నమస్కరిస్తాను / ప్రణమిల్లుతాను." ఈ మాట చాలు, "గురుస్థానం" అన్...