October 02, 2024 గాంధీ జయంతి సందర్భంగా గాంధేయవాదానికి 'అ', 'ఆ' లు ~~~~~~~~~~~~ * ~~~ * ~~~ * ~~ గాంధీగిరీ కి ఆసరా.. గాంధీయిజానికి అవసరం.. వారిరువురు. నేను గాంధేయవాదిని కాను. బళ్ళో చెప్పిన విషయాల వలన స్వాతంత్ర్యోద్యమాన్ని ఆది నుండీ నడిపిన వ్యక్తి గానూ, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఒకే ఒక్క వ్యక్తి గానూ మహాత్మా గాంధీని గూర్చి అభిప్రాయపడ్డాను. కాలక్రమేణా ఎందరో స్వాతంత్ర్య విప్లవవీరుల పోరాటాలను గురించీ, వారి త్యాగాలను గురించీ తెలుసుకున్నాక.. ఆలోచన మొదలైంది. అసలు మహాత్మాగాంధీ భారత దేశానికి రాకమునుపే ఊపిరిలూదుకున్న స్వాతంత్ర్యోద్య మ వివరాలు జ్ఞప్తి చేసుకున్నాక, నెమ్మదిగా నా ఆలోచనలు, అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. ఎంతోమంది భారత స్వాతంత్ర్య వీరులు, బ్రిటీషర్లకి వ్యతిరేకంగా తమ విప్లవ పోరాట స్ఫూర్తి రగిలించి, ఎదిరించి, నిలిస్తే మహాత్మాగాంధీ కేవలం అహింసాయుధంతో పోరాడడం నాకు మనస్కరించలేదు. (సరే అందుకు నా అర్హత ఏపాటి? ఇది కేవలం నా అభిప్రాయం అంతే) అలాగని మహాత్మాగాంధీ అంటే విముఖతో వ్యతిరేకతతో లేదు గానీ, గాంధేయమార్గం కన్నా...
Posts
Showing posts from October, 2024