పేరు లేని లేఖ ! "నిన్ను ప్రశ్నించే వీలు లేక, నా భావాలను ఆపలేక, తలంపులను దారి మళ్ళించలేక రాసుకున్నాను ఈ ఊరు పేరు లేని లేఖ!" ఏం చేశావు నువ్వు? ఏం సాధించావు నువ్వు? ఎందుకా నవ్వు? ఏదో సాధించి పెట్టావని అనుకుంటారంతా కానీ నీకు తెలుసుగా నీ అంతరాత్మకు తెలుసుగా అసలు నిజం. ఇందులో నీ స్వార్ధం లేదూ? ఆత్మ కధ రాసుకున్నావే..ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోలేదా నువ్వు? నీ వలన కాదూ వారు చనిపోయింది? నీ "చేతకాని మంచితనం" వలన కాదూ వారు మనకి కాకుండాపోయింది? మనలో లేకుండాపోయింది? వారిని, వారి జీవితాన్ని ఆర్పేసి..నువ్వు మాత్రం వెలుగుతూనే ఉన్నావే.. ఆనాడు నీకు దెబ్బ తగలకుండా ఉండుంటే..నీకు పరాభవం జరగకపోయుంటే...నీకు నొప్పి కలగకపోయుంటే..ను...
Posts
Showing posts from January, 2015
- Get link
- X
- Other Apps
ఆహా!........ఆ.హ్? డిసెంబరు 31 అర్ధరాత్రి. చాలా కోలాహలంగా ఉంది ఊరంతా.. కొత్త సంవత్సరం రాబోతోందని విందులు వినోదాలతో..కొత్త ఉత్సాహంతో తిరుగుతున్నారు అంతా.. ఏ చోట చూసినా అంతా జనసమూహంతో..యువజనోత్సాహంతో వారి కేరింతల తో నిండిపోయింది.. వీధులన్నీ ఈ ఉత్సాహాన్ని కళ్ళల్లో వెలుగులు నింపుకుని మరీ చూస్తున్నాయి .. ఎక్కడా చీకటన్న మాటే లేదు. (ఈ చలిలో రోడ్డు పక్కగా ముడుచుకుని పడుకుని ఉన్న భిక్షగాళ్ళ మనసుల్లో తప్ప. వారి జీవితాల్లో తప్ప . నిజమే మరి ఎన్ని సంవత్సరాలు వచ్చిన వారి జీవితాలలో ఐతే మార్పు ఉండదుగా. అయినా ఇవన్నీ అలోచించే పరిస్తిత్లో ఎవరూ లేరు. ఎవరి ఆనందంలో వారున్నారు ). సరదాగా అర్ధరాత్రి పూట స్నేహితులతో బైకు మీద చక్కర్లు కొడితే ఆ మజానే వేరు. అందులోను ఇలా బైకు వెలుతురుతో రాత్రి చీకట్లను చీలుస్తూ..కొత్త సంవత్సరాన్ని అందరికోసం, మనమే మన వీపు మీద మూటకట్టుకుని మోసుకొచేస్తున్న అనుభూతి మరీ ఆనందంగా ఉంటుంది కదా. కుర్రకారు హుషారుగా బైకులలో రేసులు పెట్ట...