Posts

Showing posts from February, 2015

నా కోసం ప్రయత్నించే ..నీకోసం నిరీక్షిస్తూ...

ప్రియమైన నీకు... నేనే. అవును స్వయానా నేనే...నీకు రాస్తున్న లేఖ.   ప్రపంచమంతా ప్రేమ నిండి ఉంది. నేడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ వారి ప్రేమని వ్యక్తపరుస్తుంటే..నాకు కూడా ఈరోజు నా మనసులోని మాట నీకు చెప్పాలనిపించింది. నువ్వు నన్ను ప్రేమించావు. నాకు తెలుసు. నాకోసం నువ్వు కొన్నాళ్ళు నిరీక్షించావు కూడా. కానీ నా నుండి స్పందన లేదన్న ఒక అపోహతో నేను నిన్ను అంగీకరిస్తానో లేదోనన్న అనుమానంతో నువ్వు " తనని " కలిసావు.. " తనతో "నే ఉండిపోయావు.   నేను కాదంటానేమో అన్న ఒక అపోహతో నువ్వే తన వెనక పడ్డావు. "తనని" వరించావు. కానీ...   ...నువ్వు నన్నెంతగా ప్రేమించావో నేను కూడా నిన్ను అంతగా ప్రేమించానని నీకు తెలుసా? అనుక్షణం నేను నిన్నంటిపెట్టుకునే వచ్చాను..ప్రతీ క్షణం నీ నీడలా నీ వెనకే వచ్చాను కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. ఇది కాకపోతే అది..అది కాకపోతే మరొకటి అనుకునే వరస నీది . దానికి తోడు నీ " స్నేహితుల " సహచర్యం నీ నమ్మకాన్ని బలహీనపరిచింది , నా పైన నీ ప్రేమను తుంచి వేసింది. వారిని కాకుండా నీ అంతరాత్మను నమ్ముకుని నువ్వు ప్రయత...

"సేవ - అరుణోదయ సేవాశ్రం"

Image
" సేవ - అరుణోదయ సేవాశ్రం " సంప్రదించవలసిన నంబరు: 9848539767  ( ఫోన్ నంబరులో చిన్న సవరణ: త్వరలో పై ఫోటో లోని -  పైన పేర్కొనబడిన బోర్డులోని నంబరు తీసివేసి, ఈ కొత్త నంబరు చేర్చబడుతుంది. ) వయసుమీరిన వారికి పెద్దగా కోరికలుండవు. వారు కోరుకునేది ఒక తోడు అంతే. కానీ అదే లేకపోతే? ఆదరణ మాట దేవుడెరుగు, కనీసం నిలువ నీడైనా లేకపోతే? అందుకే అలాంటివారికోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించాలన్న సంకల్పంతో తన స్వంత స్థలంలోనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసింది ఆమె. ఆమె శ్రీమతి మంజూష . అదే " సేవ - అరుణోదయ సేవాశ్రం " రంగంపేటలోని "శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల" కు కాస్త ముందుగా అదే రోడ్డులో (నాగయ్యగారిపల్లె, చంద్రగిరి మండలం లో) ఉంది ఆ ఆశ్రమం.   ఒక సగటు సాదారణ మహిళ ఆలోచనకు అందమైన రూపం అది.  మనం మన జీవితంలో ఎన్నోకష్టాలు పడ్డామనుకుంటుంటాం. అయినా బతుకుతున్నాం అనుకుంటుంటాం. అవును "బతికేస్తున్నాం" కానీ ఆదరించే వారు లేక అయినవారుండీ ఆదరణకి నోచుకోలేకపోతూ కూడా వారు "జీవిస్తున్నారు". అవును మనం బతుకుతున్నాం వారు జీవిస్తున్నారు . అక్కడ...