ఆహా!........ఆ.హ్?
డిసెంబరు 31 అర్ధరాత్రి.  చాలా కోలాహలంగా ఉంది ఊరంతా..
కొత్త సంవత్సరం రాబోతోందని విందులు వినోదాలతో..కొత్త ఉత్సాహంతో తిరుగుతున్నారు అంతా.. 
ఏ చోట చూసినా అంతా జనసమూహంతో..యువజనోత్సాహంతో వారి కేరింతల తో నిండిపోయింది..
వీధులన్నీ ఈ ఉత్సాహాన్ని కళ్ళల్లో వెలుగులు నింపుకుని మరీ చూస్తున్నాయి.. ఎక్కడా చీకటన్న మాటే లేదు.
(ఈ చలిలో రోడ్డు పక్కగా ముడుచుకుని పడుకుని ఉన్న భిక్షగాళ్ళ మనసుల్లో తప్ప. వారి జీవితాల్లో తప్ప. నిజమే మరి ఎన్ని సంవత్సరాలు వచ్చిన వారి జీవితాలలో ఐతే మార్పు ఉండదుగా. అయినా ఇవన్నీ అలోచించే పరిస్తిత్లో ఎవరూ లేరు. ఎవరి ఆనందంలో వారున్నారు ).
సరదాగా అర్ధరాత్రి పూట స్నేహితులతో బైకు మీద చక్కర్లు కొడితే ఆ మజానే వేరు.
అందులోను ఇలా బైకు వెలుతురుతో రాత్రి చీకట్లను చీలుస్తూ..కొత్త సంవత్సరాన్ని అందరికోసం, మనమే మన వీపు మీద మూటకట్టుకుని మోసుకొచేస్తున్న అనుభూతి మరీ ఆనందంగా ఉంటుంది కదా.  
కుర్రకారు హుషారుగా బైకులలో రేసులు పెట్టుకుని హేప్పీ న్యూ ఇయార్... అంటూ ...వింత అరుపులతో వెర్రి కేరింతలతో తిరుగుతున్నారు..నిజమే మరి, గడిచిపోయిన కాలం అనుభవాన్ని మిగిలిస్తే..రాబోయే కొత్త సంవత్సరం ఆశలని చివురింపచేస్తుంది గా మరి..
అందుకే అదే ఆశలతో...కొత్త సంవత్సరం లో ఏదో వింత జరగబోతుందనీ, జీవితంలో ఏదో మార్పు తీసుకువచ్చేస్తుందనీ.. ఆశతో అదే ఉత్సాహంతో నేనూ నా స్నేహితులతో రాత్రంతా హుషారుగా షికారు చేసి వచ్చాను. 
ఇంటికివచ్చి తెల్లవారి వెలుగులతో పాటు నా జీవితం కూడా మారిపోతుందన్న ఆశతో హాయిగా నిద్రపోయాను.
పొద్దున లేచాను...
షరా మామూలే...సూర్యుడి రంగు మారలేదు..
నా దినచర్య మరలేదు..రోజూలాగానే గడుస్తోంది.
అరెరె? రోజూ లాగానే ఆకలి కూడా  మామూలుగానే వేస్తొంది.
కొత్తసంవత్సరం..ఏదో మార్పు వచ్చేస్తుంది..ఏదో జరిగిపోతుంది అనుకున్నాను, మరి ఏమీ మారలేదే?
రోజూలానే ఉంది ఈరోజు కూడా. మార్పేమీ లేదు...
నిజమే మరి..కొత్త సంవత్సరం ఐతే ఏమిటి, పాత సంవత్సరం ఐతే ఏమిటి? మారవలసినది "మనం" కదా.. మార్పు రావలసినది మనలో కదా..   మనం మారకుండా ఇంకేమీ మారదు.
ఏదో జరిగిపోతుందని దీనికా రాత్రంతా పిచ్చివాళ్ళల్లా తిరిగాము? తిరుగుతున్నప్పుడు అసలు ఈ ఆలోచన ఎందుకు రాలేదు?
అవును. అప్పుడు జ్ఞప్తికి  వచ్చింది రాత్రి ఆ మంచులో చలిలో..రోడ్డు వారన ముడుచుకుని పడుకుని ఉన్న భిక్షగాళ్ళ పరిస్థితి. రెడీ అయి స్నేహితులని కలిసాను..వారితో మాట్లాడుతుంటే అందరికీ ఇదే ఆలోచన.. వెంటనే వెళ్ళి ఆ ఫుట్పాత్ పైన చూశాము ఆ భిక్షగాళ్ళ కోసం. వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. మనం బైకు లు పట్టుకుని తిరుగుతాము. వారు పొట్ట చేత పట్టుకుని తిరుగుతారు...ఆ జానెడు పొట్టను నింపుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళుంటారు.
అప్పుడే మేము స్నేహితులంతా నిశ్చయించుకున్నాం. మార్పు మనం తీసుకొద్దాం..ముందు మనం మారదాం.
సంతోషం అంటే మనతో మనం గడపడం కాదు..మన ముఖాలలోని వెలుగు కాదు, ఆరిపోతున్న జీవితాలని వెలిగించడం. పక్కవారికి ఆనందం పంచడం..వారి ఆకలి తీర్చడం. అప్పుడు వారి కళ్ళల్లో కనిపించేదే నిజమైన సంతోషం. ఇక నుండీ మన ధ్యేయం ఇదే అనుకుని ముందుకి కదిలాం.
ఇది నిజమైన న్యూ ఇయర్..
శ్రీ మూర్తి కొంపెల్ల!

01st January, 2015

Comments

Post a Comment

Popular posts from this blog

ఎవరు గురువులు?

మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా.. (ఏప్రిల్ 30, 2020)

"సేవ - అరుణోదయ సేవాశ్రం"